హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్ కు పాల్పడారు నిందితులు. పాత బస్తీలో బ్యాంకు నుంచి 175 కోట్ల లావాదేవీలు జరిపారు. ఇందులో సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు సహకరించారు. జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసారు ఆటో డ్రైవర్లు. ఆ అకౌంట్స్ ద్వారా 175 కోట్ల లావాదేవీలు జరిపారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు ఈ పైసల్ పంపారు. ఇందులో క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేసారు ఆటో డ్రైవర్లు.
మొదట బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారు.
ఇలా హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపారు. 600 కంపెనీలకు అకౌంట్లను లింక్ చేసారు సైబర్ నేరగాళ్లు. అయితే వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి అకౌంట్లు తెరిచారు ఆటో డ్రైవర్లు. అయితే సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ప్రస్తుతం వారికి సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసింది.