తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. ఓవైపు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన అధికారులు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేగం పెంచారు. ఇందులో భాగంగానే.. ఈ నెల 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసిందని రాష్ట్ర అధికారులు వెల్లడించారు.  హైదరాబాద్‌లో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల లెక్కింపు  కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో  చేపట్టనుండగా… మిగిలిన 13 నియోజవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  రంగారెడ్డి జిల్లాలో నాలుగు ,  మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక్కోటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  అధికారులు ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం  ఏర్పాట్లు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version