తెలంగాణ పట్టణ ప్రజలకు శుభవార్త..ఆస్తి పన్నులో 90 శాతం సబ్సిడీ

-

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను పై మున్సిపల్ శాఖ కీలక ప్రకటన చేసింది. 90% వడ్డీని మాఫీ చేస్తున్నట్లు.. వన్ టైం సెటిల్మెంట్ స్కీం ను ప్రవేశపెట్టింది. జిహెచ్ఎంసి సహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లలో ఈ పథకాన్ని అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది.

tax
tax

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ శాఖ. అక్టోబర్ 31వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఆర్థిక సంవత్సరం 2021-22 వరకు ఉన్న బకాయిలను 10% వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రజలకు భారీ ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news