శ్రీశైలం రహదారిపై బరితెగించిన ప్రేమ జంట.. ఏకంగా బైకు మీదే!

-

నేటితరం యువతీయువకులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్యంగా రొమాన్స్ చేసుకుంటూ ప్రయాణికులు, తోటివారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మొన్నటివరకు ఈ కల్చర్ ఎక్కువగా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కనిపించగా, తాజాగా ఇది హైదరాబాద్‌కూ పాకింది. పార్కులు, బస్టాండ్లు, సినిమా హాల్స్‌లో ఎక్కువగా కనిపించే ఇటువంటి దృశ్యాలు.. తాజాగా శ్రీశైలం రహదారిపై దర్శనమిచ్చింది. అది కూడా రన్నింగ్ బైకు మీద వెళ్తూ ఓ జంట రొమాన్స్ చేసుకుంటున్న సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకివెళితే..శ్రీశైలం రహదారిపై ఓ ప్రేమ జంట చేసిన పనిని చూసి తోటి వాహనదారులు విసుగు చెందారు. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళుతూ పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటున్నారు.పెట్రోల్ ట్యాంకుపై ప్రియుడికి ఫేస్ టు ఫేస్ కూర్చున్న యువతి అతడికి ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. పక్కనే వెళ్తున్న వాహనదారులు వీరు చేస్తున్న అతిని చూస్తున్నారని కూడా భయం లేకుండా బరితెగించారు. హాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను కారులో వెళ్తున్న మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version