Hyd: ఇన్ స్టా గ్రామ్ లో వేధింపులు…యువతి సూసైడ్..యువకుడు కూడా !

-

Hyd: హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీ.ఫార్మసీ చదువుతున్న విద్యార్థి తేజస్విని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

A young woman committed suicide after being harassed by a young man she met on Instagram

గుమ్మడిదల (మం) దోమడుగులో నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక యువతి మృతికి కారణమైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. శ్రీహరిని చికిత్స కోసం సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఇన్ స్టాలో పరిచయమై ప్రేమ పేరుతో వేధించాడు శ్రీహరి. కొన్ని రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ కూడా జరిగింది. ఈ తరుణంలోనే… బిల్డింగ్ పై నుంచి దూకి తేజస్విని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version