అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఛలో హైదరాబాద్ కి పిలుపునిచ్చింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు, కెసిఆర్ సర్కార్ పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 1వ తేదీన ఏబీవీపీ చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చింది. “తెలంగాణ విద్యార్థి కథనభేరి” పేరుతో ఆగస్టు 1న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేధించాలని, ఫీజుల నియంత్రణ చట్టం చేసి అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. పెండింగ్ లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చింది ఏబీవీపీ.