తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

దేశంలో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, పోలీసులు ఎన్ని కఠిన రూల్స్‌ అమలు చేసినా… ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. తాజాగా మెదక్ జిల్లా నార్సింగ్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మల్లూరు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆర్మూర్ మండలం ఏలూరు వాసులుగా గుర్తించారు. వారంతా ఆర్మూర్ నుంచి గజ్వేల్ కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version