కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే కళ్ళలో నీళ్లు వచ్చేవి – హరీష్ రావు

-

నేడు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే కళ్లలో నీళ్లు వచ్చేవన్నారు. బీఆర్ఎస్ వచ్చాక పండిన పంట, ప్రతి గింజను కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోళ్లు చేసిందని తెలిపారు.

ఆనాడు వ్యవసాయం చేయాలంటే రైతుల కళ్లలో నీరు వచ్చేదని.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి రైతు పొలానికి సాగు నీరు వచ్చిందన్నారు. చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి రాజీవ్ రహదారి నుంచి చెర్ల అంకిరెడ్డిపల్లి వరకూ రూ.61.80 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం భూమిపూజ, పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు.

అలాగే ఓపెన్ జిమ్, డంపింగ్ సెగ్రీ గేషన్ షెడ్, స్మశాన వాటిక-గ్రేవ్ యార్డు, శాలివాహన కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ – ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, మహిళా మండలి, ఎస్సీ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version