నేడు తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఫిక్స్‌ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు జనగామ సభలో, మధ్యాహ్నం 2:30కు కోరుట్ల సభలో, సాయంత్రం ఉప్పల్ రోడ్ షోలో పాల్గొంటారు.

Amit Shah election campaign in Telangana today

ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇవాళ ప్రచారం చేయనున్నారు. మరో వైపు ఈ నెల 24, 25 తేదీల్లో పీఎం మోడీ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చారు.

నారాయణపేటలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఏటీఎం లాగా మారిందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అవినీతి వల్లనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా.

Read more RELATED
Recommended to you

Exit mobile version