తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపాడు సొంత తమ్ముడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఇవాళ తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపాడు సొంత తమ్ముడు. కులాంతర వివాహం చేస్తుందని సొంత అక్కని చంపాడు తమ్ముడు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది ఈ దారుణం. కులాంతర వివాహం చేసుకున్నందుకు కానిస్టేబుల్ ను చంపాడట. కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీ కొట్టి, కొడవలితో మెడ పై నరికాడు పరమేష్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ హత్య
👉రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య
👉రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఘటన
👉హయత్నగర్ పీఎస్లో పనిచేస్తున్న నాగమణి pic.twitter.com/HedzZo410L— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024