జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ స్వీపర్ పై AR కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ డీ.పి.ఓ కార్యాలయంలో ఓ మహిళ స్వీపర్ పై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశాడట.
నిన్న ఉదయం 10 గంటల సమయం లో ఆఫీస్ క్లీన్ చేస్తుండగా సదరు మహిళ పై ఏఆర్ కానిస్టేబుల్..అత్యాచార యత్నం చేశాడట. అయితే బాధిత మహిళ గట్టిగా అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు ఏ ఆర్ కానిస్టేబుల్. ఇక ఈ విషయం బయటికి పొక్కితే పరువు పోతుందని ఓ అధికారి స్కెచ్ వేశారట. ఈ విషయం బయటికి పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ సంఘటన పైన అంతర్గ విచారణ చేస్తున్నారట అధికారులు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.