నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోండి – ఎమ్మెల్యే కోరుకంటి చందర్

-

తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని అన్నారు బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయే పనులు చేసిన ఘనత మాదేనని అన్నారు. ఒక మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మళ్ళీ రామగుండం ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకి కల్పించిన కేసీఆర్, కేటిఆర్, కొప్పుల ఈశ్వర్, కవిత లకు రుణపడి ఉంటానన్నారు కోరుకంటి చందర్.

ఆశావహులకు ఓ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నీ ముఖ్యమంత్రిని చేయడమే మీ లక్ష్యం కనుక అందరం కలిసి పని చేద్దాం అని వేడుకుంటున్నానని అన్నారు. ఆశావహులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా నన్ను సంప్రదించాలన్నారు. స్థానిక బిఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి.. దయచేసి మీరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చగలదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version