వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ ?

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్య బరిలో ఉంటారని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీలతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి, కావ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు వరంగల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇటీవలే బీజేపీలో టికెట్ దక్కకపోవడం ప్రజాశాంతి పార్టీలో చేరారు బాబు మోహన్. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా బాబు మోహన్ కి ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. రెండు రోజుల్లోనే బాబు మోహన్ కి టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version