తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య నియామకం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల)ను, సీఎం కేసీఆర్ నియమించారు.
సభ్యులుగా శ్రీమతి కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ ( ఎస్సీ మాదిగ,నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్( ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్)ను కేసీఆర్ నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
కాగా, సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. దసరా పండుగ వస్తున్న తరుణంలోనే… సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త అందించింది. 11 వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే… మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ. 1,450 కోట్లు జమ చేసింది తెలంగాణ సర్కార్.