ప్రధాని హైదరాబాద్ పర్యటన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. పరస్పరం ప్లెక్సీల రాజకీయం మొదలుపెట్టాయి ఇరు పార్టీలు. తాజాగా కేసీఆర్ బెంగళూర్ టూర్ పై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ప్లెక్సీలు ఎందుకు పెడుతున్నారు.. కావాలంటే నేరుగా ప్రధాని మోదీని కేసీఆర్ హామీలను అడగవచ్చ కదా అని అన్నారు. ప్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ముఖం చెల్లకనే కేసీఆర్ బెంగళూర్ వెళ్తున్నారని విమర్శించారు.
ఏక్తాయాత్రలో తాను చేేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అని బండి సంజయ్ అన్నారు. మసీదును తవ్వితే శివలింగం వచ్చిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పర్యటనకు మేము పర్మిషన్ తీసుకున్నామని.. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆహ్వానం చెప్పే సభకు అనుమతి తీసుకున్నామని… కార్యకర్తలను రాకుండా పోలీసులు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే డీజీపీ ఆఫీస్ ర్యాలీకి వెళ్తాం అని ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.