bathukamma in vemulawada: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఉన్న ప్రత్యేకత మరే పండుగకు లేదు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ అలాగే దసరా పండుగలే పెద్దవి.ఏడాదికి ఒకసారి ఈ పండుగలు వస్తున్న నేపథ్యంలో చాలా అట్టహాసంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు.అయితే..తెలంగాణ సంస్కృతిని ఒట్టి పడేలా చేసేది బతుకమ్మ పండుగ.ఈ పండుగను దాదాపు తొమ్మిది రోజులు చేసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు.
ఈ పండుగ పూర్తిగా పూలతో చేసేది. అయితే అందరూ సద్దుల బతుకమ్మ ను తొమ్మిది రోజుల్లో చేసుకుంటారు. కానీ వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తొమ్మిది రోజుల్లో చేసుకుంటే.. వేములవాడ ప్రజలు మాత్రం ఏడు రోజుల్లో చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వేములవాడలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.