నన్ను ఉపముఖ్యమంత్రిని చేసింది అదే : భట్టి విక్రమార్క

-

ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర నన్ను ఉపముఖ్యమంత్రిని చేసింది అని భట్టి విక్రమార్క అన్నారు. ఇక్కడ పాదయాత్ర సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మర్చిపోను . మధిర నియోజకవర్గం నాకు ఎంత ముఖ్యమో మంచిర్యాల నియోజకవర్గం అంతే ముఖ్యం అని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు మీ అభిమాన నాయకుడే కాదు మా అందరి ఆత్మ. కష్ట కాలంలో కాంగ్రెస్ నిలబెట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది.

నేనే కాదు రేవంత్ రెడ్డి , మంత్రులకు సైతం ప్రేమ్ సాగర్ రావ్ పార్టీ కోసం చేసిన సేవలు తెలుసు అన్నారు. ఇక రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులను కలిశారు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు. అయితే వారితో మంచిర్యాల జిల్లా కు వర్షం కారణం గా రాలేక పోతున్న అని తెలిపారు భట్టి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జరిగే కార్యక్రమాలు వర్షం కారణంగానే రద్దు చేసినట్లు పేర్కొన్నారు భట్టి.

Read more RELATED
Recommended to you

Exit mobile version