తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు హాలిడే!

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. నేడు స్కూళ్లకు సెలవు ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఈ రోజు అంటే సోమవారం నాడు కూడా జరగనున్న విషయం తెలిసిందే.  తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు కలిపి 1368 సెంటర్లలో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు.

Big alert for students of Telangana state Today will be a holiday for schools

ఈ క్రమంలో ఈరోజు పరీక్ష ఉండటంతో ఆ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. మిగతా స్కూళ్లు, కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కాగా, నేడు పేపర్-3, పేపర్-4 పరీక్షలు జరగనున్నాయి.  ఇది ఇలా ఉండగా… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -2 పరీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయమే పరీక్షలు ప్రారంభం కావడంతో అభ్యర్థులు అంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొంత మంది ఆలస్యంగా వెళ్లడంతో.. అధికారులు పర్మిషన్‌ ఇవ్వలేదు. దీంతో చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -2 పరీక్షలు రాయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version