వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వాహనాలు ఉన్నవారు తప్పనిసరిగా TS పేరుతో రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ మార్చాల్సిందేనని చెప్పారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఇటీవల నగరంలో కొందరి వాహనాలను ఇదే కారణంతో సీజ్ చేశారు.
AP సహా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న వాహనాలకు అక్కడ NOC తీసుకొని లైఫ్ టాక్స్ కడితే సరిపోదని, ఇక్కడ కూడా టాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెబుతున్నారు. ఇక అటు.. వాహనదారులు మాత్రం పోలీసుల రూల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సడెన్ గా ఈ రూల్స్ పెడితే.. తాము ఎక్కడికి పోవాలంటూ నిప్పులు చెరుగుతున్నారు.