సన్న బియ్యంకు బోనస్ అనేది మోసం..!

-

రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారు. అయితే ఆ చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలి అని అసెంబ్లీ వేదికగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. కౌలు రైతు ల గోస పట్టించుకునే నాథుడే లేడు. తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతు లు ఉన్నారు. వారు మీరిచ్చిన హామీతో మీకు ఓటేశారు. కౌలు రైతు లకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలి. అలాగే పంట బోనస్ 500 ఇవ్వాలి.

ప్రస్తుతం ఎన్నికల హామీలు భారేడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా ఉంది .బడ్జెట్ అంకెల గారడీ గా ఉంది. వ్యవసాయానికి 49 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో 31 వేల కోట్ల ఇచ్చారు. కేసిఆర్ మాదిరిగానే సన్న బియ్యం కు బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని ఆయన అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిలోగా ఇస్తారు అని ప్రశ్నించిన మహేశ్వర రెడ్డి రాష్ట్రంలో 7 నెలల్లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత BRS ప్రభుత్వం రైతులను విస్మరించింది. అందుకే అక్కడ కూర్చున్నారు అని గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version