అసమర్ధ.. అవినీతి ప్రభుత్వం !

-

  • తెలంగాణ‌ను ఉద్ధ‌రిస్తుంద‌నుకోవ‌డం వెర్రిత‌నం
  • సమ‌స్య‌లొస్తే చేతులెత్తేసే స‌ర్కార్‌.. !
  • టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై బీజేపీ మ‌హిళా నేత విజ‌యశాంతి ఘాటు వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర బీజేపీ మ‌హిళా నేత, ప్ర‌ముఖ సినీ న‌టి విజయ శాంతి ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఘాటు విమ‌ర్శ‌లతో మ‌రోసారి రెచ్చిపోయారు. తాజ‌గా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడమే గాని.. ఆ నిర్ణయాల అమలుకు తగిన ఏర్పాట్లు చెయ్యడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉంద‌ని ఆరోపించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ కొన్ని తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది గానీ, కోవిడ్-19 నిబంధనల్ని పాటించే పరిస్థితులు లేవని తెలిపింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్                                                                      బీజేపీ మహిళా నేత విజయశాంతి

అలాగే, తెలంగాణలో వందలాది పాఠశాలలను మరుగుదొడ్ల సమస్య, నీటి సమస్యలు వేధిస్తున్నాయ‌నీ, ఇవి అమ్మాయిలకు మరింత ఇబ్బందిగా పరిణమిస్తున్నాయ‌ని తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవ‌ల తాజా గణాంకాలతో సహా మీడియాలో కథనాలు వచ్చాయ‌న్నారు. కరోనా వ్యాప్తికి ముందే ఈ సమస్యలున్నా తెలంగాణ సర్కారు ఏనాడూ వీటిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. ఫలితంగా బాలికల డ్రాపౌట్ల సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింద‌న్నారు.

వీటికి తోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా ఉందని తెలిపారు. అప్పుడే ఏమీ చెయ్యని ఈ అసమర్ధ, అవినీతి ప్రభుత్వం ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో చేతులెత్తెయ్యడం తప్ప ఈ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న ఆశలు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు. మరోవైపు కాలేజీల్లో లెక్చరర్ల కొరత, హాస్టల్ సదుపాయాల్లో ఇబ్బంది లాంటి మరి కొన్ని సమస్యలున్నాయి. పరిస్థితులు కాస్తో కూస్తో బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదంటూ ఘాటుగా విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news