బొరబండ పోలీసులు దాస్టికంకు పాల్పడ్డారు. ఒక అడ్వకేట్ పై చేయి చేసుకున్నాడు బొరబండ ఎస్సై. కూకట్పల్లి బార్ అసోసియేషన్లో పనిచేస్తున్నారు అడ్వకేట్ సంతోష్. అయితే బెల్ట్ షాపుల తనిఖీల్లో భాగంగా పక్కనే ఉన్న రెండు నివాసాలకు వెళ్లారు పోలీసులు. అయితే అందులోనే ఉంటున్న అడ్వకేట్ సంతోష్ డోర్ తియ్యలేదు. దాంతో డోర్ తీయనందుకు అడ్వకే పై చేయి చేసుకున్నాడు ఎస్సై శేక్ నాగుల్.
అసలు ఏం సంబంధం లేకుండా.. అడ్వకేట్ అనే మర్యాద కూడా లేకుండా లుంగీ బనియన్ పైనే స్టేషన్ కు తీసుకెళ్లారు బొరబండ పోలీసులు. ఈ క్రమంలో అడ్డువచ్చిన న్యాయవాది భార్యను కూడా అభ్యంతరంగా తిట్టారు బొరబండ పోలీసులు. అయితే తనకు సంబంధం లేకుండా తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు అడ్వకేట్ సంతోష్. ఇక న్యాయవాదిపై జరిగిన ఈ దాడి నీ ఖండిస్తున్నట్లు న్యాయవాద సంఘాలు పేర్కొన్నాయి.