BREAKING : ఇవాళ BRS సర్వసభ్య సమావేశం..కేసీఆర్ సంచలన ప్రకటన చేసే ఛాన్స్

-

ఇవాళ బీఆర్ఎస్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ భేటిలో పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. అంతేకాదు.. ఈ సమావేశంలో.. సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, నిన్న మహారాష్ట్రకు చెందిన నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు సీఎం కెసిఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలకు పార్టీ కండువా కప్పి స్వయంగా సీఎం కేసీఆర్ పార్టీ లోకి స్వగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news