బీజేపీనీ నిలువరించ గలిగేది బీఆర్ఎస్సే : హరీష్ రావు

-

తెలంగాణ బీజేపీని నిలువరించగలిగేది బీఆర్ఎస్సే అని పేర్కొన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఇవాళ భద్రాచలం మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే.. గవర్నర్ తిరస్కరించారు అని తెలిపారు. కాంగ్రెస్ నామినేట్ చేసిన వారికి వెంటనే గవర్నర్ ఆమోదించారని వెల్లడించారు.

 

కాంగ్రెస్ పార్టీ బిజెపితో కుమ్మక్కైందని ఈ ఒక్క సంఘటన చూస్తేనే అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అబద్ధాలే.. ఆదిలాబాద్ లో అబద్ధాలే అన్నారు హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు.  మంచిర్యాలను జిల్లా చేసింది కూడా బీఆర్ఎస్సే. సీఎం రేవంత్ రెడ్డి  అనాగరికంగా మాట్లాడుతున్నారు.  రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు గుండు సున్నా అన్నారు. రూ. 4000 పెన్షన్ ఇప్పటివరకు రాలేదు అని..  ఉన్న రెండు వేలు కూడా ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరోగమనము ప్రారంభమైంది కేసీఆర్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కెసిఆర్ వెనకడుగు వేసి ఉంటే తెలంగాణ వచ్చేదా.. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version