యాదగిరిగుట్ట ఆలయంపై కేటీఆర్ ఓటేసి చెప్పగలరా? – రేవంత్ రెడ్డి

-

ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డలను కనికరించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ 22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ సబ్సిడీ ఎత్తేసి, గ్యాస్ సిలిండర్ ధరను అడ్డగోలుగా పెంచి ఆడబిడ్డలపై మోపిన ఆర్థిక భారానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు.

” ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు.. మునుగోడు ఉపమునుగోడు ఉపఎన్నికలో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో.. వేలమంది మందిమాగాదులతో దండయాత్ర కాకుండా.. నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా..?” అని ట్విటర్లో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news