మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే మహిళలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని చాలామంది మహిళలను రెచ్చగొట్టారని సమాచారం. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారు.
పేదలను రెచ్చగొట్టిన పది మంది పై కేసులు నమోదు చేశారట. సంగీత సీత సంతోష్ మరో ఏడుగురి పై కేసులు నమోదు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్ళూ రువ్విన వారిపై సైతం కేసులు పెట్టారట.