తెలంగాణకు 100 కంపెనీల బలగాలు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 300 కంపెనీల బలగాలను కేటాయించగా…. నేడు 100 కంపెనీల బలగాలు తొలి విడతగా రాష్ట్రానికి రానున్నాయి. ఒక్కో కంపెనీలో అసోం రైఫిల్స్, BSF, CISF, CRPF, ITBP, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమబల్ కు చెందిన 60-80 మంది వరకు ఉంటారు.
వీరంతా కీలకప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు, సమస్యత్మక ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపడుతారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ తమ సీట్లను ప్రకటించేసింది. ఇప్పటికే 115 సీట్లను భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అడు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు కూడా క్యాండిడేట్ల ఫైనల్ లిస్టును తయారుచేస్తుంది.