రైతుల కోసం రూ. 3 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌రా : కేంద్రంపై కేసీఆర్ ఫైర్

దేశంలో దొంగ‌ల కోసం ప‌దిన్న‌ర ల‌క్షల కోట్లను మాఫీ చేసిన కేంద్ర‌ ప్ర‌భుత్వం.. రైతుల కోసం రూ. 3 వేల కోట్లు ఖ‌ర్చు చేయలేదా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఆహార భద్రత లో భాగంగా దేశంలో ధాన్యం సేకరణ బాధ్య‌త కేంద్రానిదే అని అన్నారు. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వమే భ‌రించాల‌ని అన్నారు. కానీ నేటి కేంద్రం తప్పించుకుంటుందని విమ‌ర్శించారు. రైతులు పండించిన వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా.. ప్రధానికి మనస్సు లేదా అని ప్రశ్నించారు.

బీజేపీ నాయకులు చేస్తున్న పాపాల పుట్టను త్వ‌ర‌లోనే బయట పెడతామ‌ని ప్ర‌క‌టించారు. కోట్లు ఎగ్గొట్టి లండన్ లో ఉన్న వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళితే వెనక్కి పిలిపించారని ఆరోపించారు. దానికి సంబంధించిన డాక్యు మెంట్ లు ఉన్నాయ‌ని తెలిపారు. అలాగే రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అందు కోసం రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు సన్నాహాలు చేస్తున్న‌ట్టు వెల్ల‌డ‌డించారు. దీని కోసం నలుగురు అధికారులతో కమిటీ వేయ‌నున్న‌ట్టు తెలిపారు.