‘భారత్​ రాష్ట్రీయ సమితి’.. రాజకీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘భారత్​ రాష్ట్రీయ సమితి’.. అనే కొత్త పార్టీ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీలో ఈ నెల ఆఖరు లో కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్‌. నిన్న పార్టీ నేతలతో ప్రగతి భవన్‌ లో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో బిజెపి గుండాయిజం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ,సిబిఐ కేసులతో రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీస్తుందని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలో చచ్చిపోయిందని.. దేశ పౌరులుగా మనం మన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశంలో బిజెపికి ధీటుగా రాజకీయ శక్తి అవసరం ఉందని వెల్లడించారు. దేశంలో అన్ని సహజ వనరులు ఉన్న అభివృద్ధి జరగలేదని.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం పరిస్థితి మరింత దయనీయంగా తయారు అయ్యిందని తెలిపారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version