ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

-

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌దని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారీగడ్డలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఓటు అనేది మన తలరాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్ళు మరిచి ఓటేస్తే, ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి, మంచి, చెడు ఆలోచించి వేయాలన్నారు.

బతుకులు, మునుగోడు బాగుపడతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడుతది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ మునుగోడు ఉపఎన్నిక అవసరం లేకుండానే వచ్చింది. ఈ ఉపఎన్నిక ఫలితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక నాలుగు విషయాలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్లు వస్తాయి. ఎన్నికలు రాగానే ఏందో ఏమో మాయరోగం పట్టుకుంటుంది. గతరగత్తర లొల్లి లొల్లి ఉంటది. కొందరైతే గజం ఎత్తున గాల్లోనే నడుస్తున్నారు. విచిత్ర వేషదారులు, అనేక పార్టీలు వస్తాయి. ప్రజలకు మనకెందుకు ఉండాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news