రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష

-

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై సీఎం కేసీఆర్ నేడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. రోడ్డు పనుల్లో నాణ్యత పెంచే చర్చలతో పాటు రెండు శాఖల మధ్య సమన్వయం, ఆర్ అండ్ ఆర్ బి లో నియామకాలపై చర్చించారు. రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో, చేపట్టాల్సిన నియామకాలు తదితర కార్యాచరణ పై ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ బాల్క సుమన్, శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, శ్రీ దానం నాగేందర్, శ్రీ మైనంపల్లి హన్మంతరావులతోపాటు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news