సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. దమ్ముంటే ఎస్సీ రిజర్వేషన్ లో ఉద్యోగాల్లో ఎవ్వరూ లబ్ది పొందారో సీఎం రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో.. మాదిగల సీట్లు తగ్గడానికి, మాలల సీట్లు పెరగడానికి కారణం.. రేవంత్ మాలలతో కుమ్మక్కు కావడమే అన్నారు.
ప్రధానంగా సత్తుపల్లి, వర్థన్నపేట, చొప్పదండి, చెన్నూరు, అచ్చంపేట ఈ అసెంబ్లీ స్థానాల్లో, ప్రధానంగా మూడు స్థానాల్లో మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మాదిగలకు టికెట్లు రాకుండా.. మాలలకు టికెట్లు రావడానికి సహకరించింది సీఎం రేవంత్ రెడ్డి కాదా..? ఎస్సీ వర్గీకరణ ఆలస్యం వల్ల మాకు రావాల్సిన పోస్టులు వేరే వారికి వెళ్తున్నాయని పేర్కొన్నారు. గత చట్టబద్దత ప్రకారం.. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వేలాది మందికి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర్లోనే వస్తుందన్నారు. మాదిగలంతా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ.