డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు.
తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు అని తెలిపారు. వేలాది మందితో పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇది అరుదైన అవకాశం… ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం ఒక లోటుగా కనిపించిందని…మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని వివాదం చేసేందుకే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడి పెట్టారని ఆగ్రహించారు. పదేళ్లు అధికారంలో ఉండి వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు.