సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి : సబితా ఇంద్రారెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీలో  సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబిలీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తది కేటీఆర్ కి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్నే రేపాయి.

అసెంబ్లీలో సభ వాయిదా పడేందుకు దారి తీశాయి. తాజాగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు సభలో నుంచి దొంగల్లా పారిపోయినారు అని పేర్కొన్నారు. కావాలనే తనపై కక్ష కట్టారని పేర్కొన్నారు. మహిళలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవకాశం కల్పించారు. రాజశేఖర్ రెడ్డి గారు మమ్ముల్ని గౌరవించే వారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీలో మహిళలపై అవమాన కర వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని మీడియా ముందు కంట తడి పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లోని  మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version