పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్‌ శుభవార్త..వారికి రెసిడెన్షియల్ స్కూల్స్‌ !

-

పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్‌ శుభవార్త చెప్పారు. పోలీసు కుటుంబాలకు రెండేళ్లలో రెండు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి అందజేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పేరెడ్ లో పోలీస్ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు డీజీపీ జితేందర్. 11 కోట్ల 6 లక్షల రూపాయల మేర చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు డీజీపి, ఇతర ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పోలీస్ ఉంటే ఉద్యోగం కాదు.. ఇది ఎమోషన్ , బాగోద్వేగం అన్నారు.

CM Revanth’s good news for police families

డ్రగ్స్ , గంజాయి, సైబర్ క్రైమ్ పై మీరు బలంగా పని చేస్తారని మీ పై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. తెలంగాణా లో పెట్టుబడులు తీసుకు రావడం తోపాటు ప్రజల కుల వృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెల్లుతున్నామని చెప్పారు. దేశ చరిత్ర లోనే 18 వేల కోట్లు రూపాయలు కడుపు కట్టుకొని రైతులు అకౌంట్లలో జమ చేశామని వివరించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని… తెలంగాణ లో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారు, గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version