హైదరాబాద్ నగరంలోని భవనాల్లో అగ్నిప్రమాద ఘటనలపై బీఆర్కే భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డెక్కన్ మాల్లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ముగ్గురు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
అక్రమ భవనాలపై చర్యలకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ కమిటీ అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు సూచించనుంది. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతే కాకుండా అగ్నిమాపక శాఖకు భారీగా నిధుల కేటాయించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లోనే అధికంగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమచాారం. మరోవైపు అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలని కూడా నిర్ణయించారు. భాగ్యనగరంతోపాటు శివారు కార్పొరేషన్లో అగ్నిమాపక సెల్ఫ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అమలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.