కేటీఆర్‌ కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్పెషల్‌ థ్యాంక్స్‌

-

Congress MLA Medipalli Satyam: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పడం జరిగింది. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు.

Congress MLA Medipalli Satyam Special thanks to BRS Party Working President KTR

ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ-తాతయ్య కీ.శే. జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు కేటీఆర్. అయితే.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కేటీఆర్‌ ను మెచ్చుకున్నారు. కొదురుపాకలో ఇంత మంచి స్కూల్ కట్టించిన రామన్నకు ధన్యవాదాలు చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version