వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం – కొండా మురళి

-

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా తమకు పట్టు ఉన్న స్థానాలపై, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. తాజాగా వరంగల్ లో కొండా మురళి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు చేరికయ్యారు. ఈ సందర్భంగా కొండ మురళి మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించడం మానుకోవాలని అన్నారు.

టిఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా కాకుండా నిజాయితీగా విధులు నిర్వహించాలని అన్నారు కొండా మురళి. ఇకనుండి తానే స్వయంగా తిరిగి కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తాము చేసిన అభివృద్ధి తప్ప మరెక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ నే అని జోష్యం చెప్పారు. కొండా మురళి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ ఎంఈఓ సదానందం కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version