ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

-

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. ఫ్లూ లక్షణాలు కలిగి ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు కవిత. రిపోర్టు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆమె తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు తేలిందని ఆమె వెల్లడించారు.

దీంతో గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్వీట్ చేశారు. దీంతో కల్వకుంట్ల కవిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news