తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నానినే అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏదో వైసీపీని పార్టీ పరంగా శత్రువుగా చూస్తారు గాని…వ్యక్తిగతంగా మాత్రం కొడాలి నానినే టీడీపీ శ్రేణులకు శత్రువు. అయితే గతంలో కొడాలి పట్ల టీడీపీ శ్రేణులు ఇంత కోపంతో లేరు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కొడాలి నాని మంత్రి అయ్యాకే ఈ పరిస్తితి వచ్చింది. మంత్రిగా కొడాలి నాని ఏం చేశారో తెలియదు గాని…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు, లోకేష్‌లపై బూతుల వర్షం కురిపించారు.
మంత్రి పదవి పోయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు…వ్యక్తిగతంగా చంద్రబాబుని దారుణంగా తిడుతున్నారు. పరోక్షంగా భువనేశ్వరిపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కూడా లోకేష్ ఎవరికి పుట్టారో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ నేతలంతా కొడాలిపై విరుచుకుపడ్డారు. అలాగే గుడివాడ టీడీపీ శ్రేణులు కూడా కొడాలిని తెగ బూతులు తిట్టారు. అలాగే గుడివాడలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు.
ఇలా కొడాలిపై తమ్ముళ్ళు కసితో రగిలిపోతున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ కొడాలికి చెక్ పెట్టాలంటే లోకేష్ ఇక్కడ పోటీ చేయాలని కొందరు తమ్ముళ్ళు అంటున్నారు. రావి వెంకటేశ్వరరావు మళ్ళీ పోటీ చేస్తే కొడాలి గెలిచే ఛాన్స్ ఉంది. అదే లోకేష్ ఉంటే బలాబలాలు మారుతాయి అంటున్నారు. ఇప్పటివరకు కొడాలి గుడివాడలో వరుసగా గెలవడానికి కారణం ఎస్సీ, ముస్లిం, కాపు ఓటర్లు.
లోకేష్ దిగితే ఆ వర్గాలు కాస్త టీడీపీ వైపు చూడవచ్చు అని, అలాగే ఎప్పుడు సపోర్ట్ ఉండే బీసీ, కమ్మ వర్గాల మద్ధతు ఇంకా పెరగవచ్చు అని అంటున్నారు. ఇక జనసేన మద్ధతు ఉంటే కొడాలికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. అయితే లోకేష్ బరిలో దిగినా, జనసేన మద్ధతు ఉన్నా సరే గుడివాడలో కొడాలిని ఓడించడం అంత ఈజీ కాదు.