N కన్వెన్షన్ రేవంత్ కూల్చేయడం మంచిదే..!

-

N కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. BRS ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యింది. ఇప్పుడు రేవంత్ కూల్చేయడం మంచిదే. ఆయన మంచి నటుడు కావచ్చు. కానీ కక్కుర్తి ఎందుకు. సినిమా డైలాగులు కొట్టడం కాదు. బుకాయింపు మాటలు వద్దు. నాగార్జున ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్నాళ్లు N కన్వెన్షన్ ద్వారా అనుభవించిన దానికి ప్రభుత్వం కి పరిహారం కట్టాలి అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

అలాగే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లు ప్రతీవ్రత మాటలు మాట్లాడుతున్నారు. కానీ చెరువులు.. కాలువలు కబ్జా చేస్తే నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. నగరంలో అర గంట వర్షం పడితే గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ లోని కబ్జాకు గురైన చెరువులు అన్ని ఖాళీ చేయించాలి. ఈ విషయంలో మా పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది అని సీపీఐ నారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version