సీఎం కేసీఆర్ కు దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ.. ఆన్లైన్ లోన్ యాప్లను రద్దు చేయాలంటూ..

-

ఆన్లైన్ లోన్ యాప్ లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఆన్లైన్ లోన్ యాప్ ల మాఫియా దుర్మార్గాలని ఆధారాలతో లేఖలో వివరించారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల మాఫియా కారణంగా అనేక మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రతి నిత్యం ఆన్లైన్ లోన్ యాప్ లపై ఫిర్యాదులు వస్తున్న పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అన్ని ఆన్లైన్ లోన్ యాప్ లను అణచివేయాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించడానికి టోల్ఫ్రీ నెంబరు, ప్రత్యేకమైన ఈ మెయిల్ ఐడి తో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్, ఆర్బీఐ ఆమోదం ఉన్న యాప్ లోకి అనుమతి ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, చిన్న, మధ్యతరహా, చిరువ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాల పేదలకు రుణాలు ఇచ్చేలా పాలసీ తేవాలని లేఖలో పేర్కొన్నారు దాసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Latest news