నాగార్జున సాగర్లో తగ్గుతున్న నీటి నిల్వలు. తొలిసారి హైదరాబాద్ నగరానికి తాగు నీటి ముప్పు..!

-

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాలు వ్యవసాయం పై ఆధారపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలను రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో సాగర్ ప్రాజెక్ట్ లోకి చుక్క వాటర్ కూడా రాలేదు. దీంతో నాగార్జున సాగర్ లో రోజు రోజుకు   నీటి నిల్వలు తగ్గుతున్నాయి.

ముఖ్యంగా  తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి హైదరాబాద్ నగరానికి తాగు నీటి ముప్పు ఏర్పడింది. ఇక  ఎండాకాలం రాకముందే హైదరాబాద్ సిటీకి నీటి కరవు వచ్చేలా  కనిపిస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520 అడుగులు ఉంది. 510 అడుగుల వరకు మాత్రమే ఎలాంటి పంపింగ్ లేకుండా తాగునీటి కోసం తరలించే అవకాశముంది.  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ జల వివాదం కారణంగా డెడ్ స్టోరేజ్ నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేసే అవకాశం చాలా కష్టం అనే చెప్పాలి.  ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ సిటీలో తాగునీటి కోసం ఈ వేసవికాలంలో  ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version