హైదరాబాద్‌ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు – డిప్యూటీ సీఎం భట్టి

-

హైదరాబాద్‌ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII తెలంగాణ స్టేట్ అన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ….తెలంగాణలో పెట్టుబడులుపెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉన్నదని తెలిపారు.

Deputy CM Bhatti’

ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుంది…తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి గా చూస్తున్నదని వివరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల అమలులో మహాలక్ష్మి పథకం కింద మహిళల అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్ ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నామని… మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version