తెలంగాణ రైతులకు శుభవార్త..సంక్రాంతికే ఆ నిధులు !

-

తెలంగాణ రైతులకు శుభవార్త అందేలా కనిపిస్తోంది. సంక్రాంతికే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రెడీ అయిందట రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఇందులో భాగంగానే… నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుంది. ఈ సందర్భంగా రైతు భరోసా విధివిధానాలపై చర్చ.. గురుకుల హాస్టల్ మెనూపై సమీక్షించనుంది సబ్ కమిటీ.

Deputy CM Bhatti Vikramarka chaired the cabinet sub committee meeting on farmer assurance

అయితే….రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత… నిధులు ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనే దానిపై ప్రకటన రానుందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సంక్రాంతికే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రెడీ అయిందట రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఒక వేళ సంక్రాంతికే రైతు భరోసా నిధులు విడుదల అయితే… మాత్రం రైతుల పంట పండినట్లే. కానీ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అనేక ఆంక్షలు పెట్టే ఛాన్స్‌ లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version