తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… రాష్ట్రంలోని చాలా దేవాలయాలను అభివృద్ధి చేస్తోంది. యాదాద్రి దేవాలయాన్ని మాత్రం.. మరో తిరుమల గా తీర్చిదిద్దింది. ఇక ఇప్పుడ.. వేముల వాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే, వేముల వాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వేములవాడను కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్ శివరాత్రి వేడుకలకు ఆదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని సూచించారు.