కొండా సురేఖకు షాక్ తగిలింది…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్ నిరసనలు తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కార్య నిర్వహణ అధికారి కార్యాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులకు కోడెలు ఇవ్వడంపై నిరసనలు తెలిపారు. వేములవాడ ఈవోను సస్పెండ్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు.
కాగా వేములవాడ రాజన్న కోడెల విక్రయ వ్యవహారం సంచలనం రేపుతోంది. మంత్రి సురేఖ సిఫార్సుతో.. ఆగస్టు 12న ఆమె అనుచరుడు రాంబాబుకి 49 కోడెలు అప్పగించారట. ఇప్పుడు రాము వాటిని అక్రమంగా విక్రయించడంతో.. సర్వత్రా ఆందోళన నెలకొంది. బీఆర్‌ఎస్ పార్టీతో పాటు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది వ్యవహారం. దీంతో రాంబాబుపై కేసు నమోదు.. విచారణ జరపాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.