రేవంత్ రెడ్డి ఐటెం సాంగ్ లాంటి వ్యక్తి అంటూ చురకలు అంటించారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ రేవంత్ రెడ్డి మొన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రేవంత్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తనపై రేవంత్ చేసిన ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. పాలకుర్తిలో మాట్లాడుతూ….’ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ…. ఆ నేపాన్ని నాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ ఒక బ్రోకర్, జోకర్, బ్లాక్ మెయిలర్. అతను ఐటెం సాంగ్ లాంటి వ్యక్తి అని టిడిపిలో ఉన్నప్పుడే సిబిఎన్ కు చెప్పా. పోస్టర్లు వేసుకునే అతను…. డబ్బున్న అమ్మాయిని బోల్తా కొట్టించి పెళ్లి చేసుకున్నారు’ అని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.