కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరాను: వివేక్‌

-

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులంతా పార్టీల మార్పుపై ఫోకస్ చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. జింపింగ్​లతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోష్ నెలకొంది. కీలక నేతలే పార్టీలు మారుతుండటంతో వారితో పాటు వారి అనుచరగణం కూడా వెంట వెళ్తున్నారు. తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని.. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొచ్చారు. టికెట్‌ అనేది తనకు అంత ముఖ్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా తన వంతు కృషి చేస్తానని మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version