తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్గడ్ లో అతి త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య CEC షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్ నుంచి డిసెంబర్ తొలి వారంలో పోలింగ్, అదే నెల 10-15 మధ్య ఫలితాలు వెలువరించినట్లు సమాచారం. కాగా, TS, MP, రాజస్థాన్, మిజోరాం లలో ఒకే విడతలో, ఛత్తీస్గఢ్ లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ తరుణంలోనే.. మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. మహిళలు, యువత, రైతులే ఏజెండాగా మేనిఫెస్టో ఉండ బోతున్నట్లు సమాచారం. సిలిండర్ ధర రూ.450-500కే ఇవ్వడంతో పాటు యువత ఉద్యోగాలకు ఉచితంగా ప్రిపేర్ అయ్యేలా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే అంశాలను ఇందులో చేర్చినట్లు తెలు స్తోంది. రైతులకు పింఛన్లు, ఉచిత ఎరువుల హామీలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారట.